Close

వైద్య విధాన పరిషత్

శాఖ గురించి సంక్షిప్త గమనిక:-

                తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 2014 సం. లో విభజించిన తరువాత, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఏర్పాటు చేసుకొని, 2014, జూన్ 2 నుండి అమలులోకి తీసుకు రావటం జరిగినది. (శాసన చట్టం నం.29 యొక్క 1986 ద్వారా రాష్ట్రంలోని సెకండరీ స్థాయి ఆసుపత్రులను నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడినది).

              మన తెలంగాణ రాష్ట్రం లో నేటికి మొత్తం (179) వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు విస్తరించి ఉన్నాయి. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పేద మరియు గిరిజన ప్రజలు సుదూర ప్రాంతాలాకు వైద్యం కోసం వందల కిలోమీటర్లు వ్యయ ప్రయసలోర్చి ప్రాణాలు అర చేత పెట్టుకొని వెళ్ళకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తూ స్థానికంగానే ఉన్న అన్ని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులను స్పెషలిస్ట్ సేవల కోసం బలోపేతం చేయటానికి గత రెండు నెలల వ్యవదిలో తగు అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టటం జరిగింది అలాగే అన్ని రకాల ప్రత్యేక వైద్య నిపుణులను నియమించుకొని జిల్లాలోని పేద మరియు గిరిజన ప్రజలకు మాత్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఓడిశా నుండి వచ్చే పేద ప్రజలకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందించటం జరుగుతుంది.

 (07) ప్రభుత్వ ఆసుపత్రులు క్రింద చూపిన విధంగా ఉన్నాయి :

వ.సం.

ఆసుపత్రి పేరు

పడకలు

వ్యాఖ్యలు

1

ఏరియా ఆసుపత్రి, భద్రాచలం

200

 

2

ఏరియా ఆసుపత్రి, మణుగూరు

100

 

3

ఏరియా ఆసుపత్రి, అశ్వారావుపేట

100

30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల నుండి 100 పడకల ఏరియా ఆసుపత్రి లకు కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడింది

4

ఏరియా హాస్పిటల్, యెల్లందు

100

5

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పాల్వొంచ

50

 

6

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బుర్గంపహాడ్

30

 

7

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చర్ల

30

30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా కొత్తగా ఏర్పాటు చేయబడింది

మొత్తం

610

 

 

TVVP హాస్పిటల్స్ కార్యకలాపాలు (సంరక్షణ, సౌకర్యం మరియు  మర్యాద కొరకు TVVP ):-

పైన తెలిపిన (07) తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, కమిషనర్ TVVP, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి నియంత్రణలో మరియు సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయ౦, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (DCHS) వారి పర్యవేక్షణలో పని చేస్తున్నాయి.

ఈ ఆసుపత్రులు ఔట్ పేషెంట్ సేవలు, ఇన్ పేషెంట్ సేవలు (అత్యవసర & శస్త్రచికిత్సతో సహా), రోగనిర్ధారణ సేవలు మరియు ప్రయోగశాల సేవలను అందిస్తాయి.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు బోధనా ఆసుపత్రులతో పాటు గా ఈ (07) తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు మలేరియా, క్షయ, కుటుంబ సంక్షేమం, ఎయిడ్స్ మొదలైన వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుకు వేదికగా పనిచేస్తాయి.

  • ఏరియా హాస్పిటల్స్ అయినభద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట మరియు యెల్లందు ప్రభుత్వ ఆసుపత్రులు (100 -200) పడకల సామర్ధ్యం కలిగి, ప్రసూతి & గైనకాలజీ, పీడియాట్రిక్స్, మత్తు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ENT, ఎముకలు, కంటి శస్త్ర చికిత్స, పాథాలజీ మరియు డెంటల్ వంటి క్లినికల్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నాయి.
  • కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయిన పాల్వొంచ, బుర్గంపహాడ్ మరియు చర్ల (30-50) పడకల సామర్ధ్యం కలిగి, ప్రసూతి & గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి క్లినికల్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాయి.

సిబ్బంది & సంప్రదింపు వివరాలు: 

  క్రమ సంఖ్య   అధికారి పేరు     హోదా   పని చేసే చోటు సంప్రదంచాల్సిన నెం.         కార్యాలయం ఇ-మెయిల్
1 డాక్టర్ రవిబాబు.G   MS., ENT సూపరింటెండెంట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ (DCHS), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 9949882286 superintendentbhadradri@gmail.com

 

గ్రూప్బి అధికారులు:

వ.సం.

హాస్పిటల్ పేరు

మెడికల్ సూపరింటెండెంట్ పేరు

ఫోన్. నం

RMO పేరు

ఫోన్. నం

1

ఏరియా ఆసుపత్రి, భద్రాచలం

డా.ఎం.రామకృష్ణ, MS.,GS

9959086989

డా.వై.రాజశేఖర్ రెడ్డి, MD.Pead.

9705123931

2

ఏరియా ఆసుపత్రి, మణుగూరు

డాక్టర్ కె. సునీల్ మజ్నేకర్, MBBS

8317541454

డా.ఎం.నరేష్, ఎం.ఎస్., ఇ.ఎన్.టి

9849704708

4

ఏరియా ఆసుపత్రి, అశ్వారావుపేట

డా. బి.విజయ కుమార్, MBBS.,

7673996001

5

ఏరియా ఆసుపత్రి, యెల్లందు

డా. రవిబాబు. జి, MS., ENT,(I/c)

9949882286

Dr.G.హర్షవర్ధన్, MS., ఆర్థో

9294009294

3

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పాల్వొంచ

డా. ఎం.ముక్కంటేశ్వర రావు, MBBS.,DCH

9700931010

Dr.S.సోమరాజు దొర, MS.,GS

8074753002

6

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బుర్గంపహాడ్

డా. రవిబాబు. జి, MS., ENT,(I/c)

9949882286

డా. ఎన్. శైలేష్ కుమార్, MBBS.,DNB, ఆర్థో.

9581269278

7

కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చర్ల

డా. రవిబాబు. జి, MS., ENT,(I/c)

9949882286

డాక్టర్ బూరుగడ్డ సాయి వర్ధన్, ఎం.బి.బి.ఎస్

8985190266

 

 

జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ (DCHS),

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.