Close

పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్

      1.సంక్షిప్త వివరణ:

                    పబ్లిక్ హెల్త్ & మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంది. ప్రధానంగా సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణను ప్రాథమిక కనీస అవసరంగా అందించడానికి మరియు పట్టణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పని చేస్తుంది.

  1. శాఖ యొక్క కార్యకలాపాలు:

                    రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్‌లలో నీటి సరఫరా మరియు మురుగు నీటి శుద్ధి పథకాల పరిశోధన, డిజైన్‌లు మరియు అమలుకు ఈ శాఖ బాధ్యత వహిస్తుంది, అలాగే ఈ మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్‌లలోని అన్ని ఇంజనీరింగ్ పనులపై సాంకేతిక నియంత్రణ కలిగి ఉంటుంది, నీటి సరఫరా మరియు మురుగునీటి పథకాలను పూర్తయిన తర్వాత తదుపరి ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం సంబంధిత మునిసిపాలిటీలకు అప్పగిస్తున్నారు.

  1. శాఖ కింద అమలు చేయబడిన పథకాలు:
  1. పాల్వంచ మరియు ఇల్లందు మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ కింద మంచి నీటి సరఫరా పథకములు.
  2. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మరియు ఇల్లందు మున్సిపాలిటీలలో సమీకృతవెజ్మరియు నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణం.
  3. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మరియు ఇల్లందు మున్సిపాలిటీలలో వైకుంఠధామములనిర్మాణం.
  4. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మరియు ఇల్లందు మున్సిపాలిటీలలో ఆధునిక ధోబీ ఘాట్లనిర్మాణం.
  5. కొత్తగూడెం మున్సిపాలిటీ నందు SDF నిధుల ద్వారా కాల్వతండా పుంపుహౌస్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు 800mm Dia పైప్ లైన్ వేయుట.
  6. కొత్తగూడెం మునిసిపాలిటీలో SDFనిధుల ద్వారాఇల్లందు క్రాస్ రోడ్డు  వద్ద  ప్రస్తుతం ఉన్న ఫిల్టర్ బెడ్‌కు పునరుద్ధరణ పనులు.
  7. పాల్వంచ మున్సిపాలిటీలోSDF నిధుల ద్వారా పైప్ లైన్ లేని ప్రాంతాలలో పైపులైన్ల విస్తరణ.

 

సిబ్బంది & సంప్రదింపు వివరాలు: 

  క్రమ సంఖ్య   అధికారి పేరు     హోదా   పని చేసే చోటు సంప్రదంచాల్సిన నెం.         కార్యాలయం ఇ-మెయిల్
      1.    వి.శ్రీనివాసరావు

ఉప కార్యనిర్వాహక ఇంజనీర్

  కొత్తగూడెం

7995075410

deephktdm@gmail.com

      2 

కె. సత్య

సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్

 కొత్తగూడెం

7995075403

deephktdm@gmail.com

 

 

పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్,

      భద్రాద్రి కొత్తగూడెం.