Close

యువజన & క్రీడలు

  1. శాఖగురించి సంక్షిప్త గమనిక:

2016 సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మూడు విభాగాల అధిపతుల నియంత్రణలో “జిల్లా యువజన మరియు క్రీడా కార్యాలయం” పేరుతో కార్యాలయం స్థాపించబడింది.

    విభాగాల అధిపతి:

1)TSSTEP:తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ & ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్, HOD: చైర్మన్, TSSTEP,సికింద్రాబాద్.

2) Youth Service (యువజన సర్విసుల శాఖ):HOD: డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, సికింద్రాబాద్.

3)SATG(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) HOD:  వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, SATG, హైదరాబాద్.

  1. కార్యకలాపాలు:
  1. యువజనసర్విసుల శాఖ: డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ వారి సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవ వేడుకలు, జిల్లా యువజనోత్సవాలు మరియు ఇతర యువజన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
  1. క్రీడలు:వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, SATG, హైదరాబాద్ వారి సూచనల ప్రకారం వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంపులు, తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల ఎంపికలు, జాతీయ క్రీడా దినోత్సవం, ఒలింపిక్ డే రన్, సివిల్ సర్వీస్ టోర్నమెంట్ మరియు ఖేలో ఇండియా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 
  • డిపార్ట్మెంట్& స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కింద అమలు చేయబడుతున్న పథకాలు:

        1 .విలువిద్య శిక్షణ: ఆర్చరీ విభాగంలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా సెంటర్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రూ.9.25 లక్షలతో మంజూరు చేసింది మరియు ఆర్చరీ సెంటర్ మినీ స్టేడియం, పాల్వొంచలో ఉదయం మరియు సాయంత్రం సెషన్లలో 40 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరుగుచున్నది.

 

  1. లాన్టెన్నిస్: రూ.50.00 లక్షలతోలాన్ టెన్నిస్ కోర్టును నిర్మిచటం జరిగినది  మరియు క్రీడాకారులకు ఉదయం మరియు సాయంత్రం శిక్షణ ఇవ్వడం జరుగుచున్నది. 

 

  1. సమ్మర్కోచింగ్క్యాంపులు: 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న (500) మంది విద్యార్థులతో ప్రతి సంవత్సరం మే 1 నుండి 31వ తేదీ వరకు జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వేసవి శిబిరాలు నిర్వహించడం జరుగుచున్నది.

 

  1. స్టేడియాలు:ఒక్కోనియోజకవర్గంలో రూ.2.65 కోట్లతో ఒక మినీ స్టేడియం మంజూరైంది. ఇల్లందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలలో స్టేడియం నిర్మాణం జరుగుతున్నది. భద్రాచలం & అశ్వారావుపేట నియోజకవర్గాల్లో భూమి కోసం గుర్తింపు ప్రక్రియలో ఉంది. 

 

సిబ్బంది & సంప్రదింపు వివరాలు: 

  క్రమ సంఖ్య   అధికారి పేరు     హోదా   పని చేసే చోటు సంప్రదంచాల్సిన నెం.         కార్యాలయం ఇ-మెయిల్
      1.

 ఎం.పరంధామ రెడ్డి

జిల్లా యువజన & క్రీడల అధికారి

  కొత్తగూడెం

9849913068

dysobhadradri@gmail.com

      2 

ఆర్.ఉదయ్ కుమార్

అసిస్టెంట్ మేనేజర్

 కొత్తగూడెం

9603649969

dysobhadradri@gmail.com

 

 

 

జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .