ముగించు

తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్యక్షతన గోదావరి వరదల ఉధృతి గూర్చి భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు నందు ఏర్పాటు చేయబడిన సమీక్షా సమావేశము.

గౌరవ తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టరు గారు మరియు ఎస్పీ గారు కలిసి గోదావరి వరదల ఉధృతిని భద్రాచలం వంతెన పై నుంచి వీక్షించారు. అనంతరం గౌరవ మంత్రి వర్యుల అధ్యక్షతన భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు నందు ఏర్పాటు చేయబడిన సమీక్షా సమావేశమునకు అన్ని సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు, మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరింత పటిష్టంగా వరద సహాయక చర్యలు చేపట్టాలని గౌరవ మంత్రివర్యులు తెలిపినారు