భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేయబడిన గోదావరి వరదల పునరావాస శిబిర సందర్శన, ప్రజలకు పండ్లు పంపిణీ
జిల్లా కలెక్టర్ గారు,గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు ప్రజా ప్రతినిధులతో కలసి భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేయబడిన పునరావాస శిబిరాన్ని సందర్శించి, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు బూర్గంపాడు నందు ఏర్పాటు చేయబడిన పునరావాస శిబిరాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు.