ముగించు

చరిత్ర

ఖమ్మం జిల్లా నుండి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. జిల్లా సరిహద్దులు భూపాలపల్లి, మహాబూబాబాద్ మరియు ఖమ్మం జిల్లాలు మరియు ఆంధ్ర ప్రదేశ్ మరియు చత్తీస్గఢ్ రాష్ట్రాలు. జిల్లాలో 23 మండలాలు మరియు 2 రెవెన్యూ డివిషన్స్ కొత్తగూడెం మరియు భద్రాచలం ఉన్నాయి. జిల్లా ప్రధాన కార్యాలయం కొత్తగూడెం పట్టణంలో ఉంది.

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రధాన యాత్రాస్థలం.  భద్రాచలం ఆలయ పట్టణం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణం రామాయణ కాలంలో ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భద్రాచలం అనే పేరు భద్రగిరి అనే పదం నుండి తీసుకోబడింది ( మేరు మరియు మేనకల బిడ్డ భద్ర యొక్క పర్వత నివాసం). భద్రాచలం లోని ప్రసిద్ధ ఆలయం, రామ, సీత మరియు లక్ష్మణుల యొక్క ఆర్చా మూర్తుల నివాసంగా ఉంది . ఈ విగ్రహాలు స్వయంభూ: అంటే స్వీయ-ప్రతిష్టితమైనవని నమ్ముతారు.